
అభిమానుల ఆవేశాన్ని తగ్గించేందుకు నాగార్జున నేరుగా రంగంలోకి దిగారు. డమరుకం విడుదలకు శివుడు ఆజ్ఞ రాలేదనీ, పరమేశ్వరునికి పూజలు చేయండంటూ అభిమానులకు పిలుపునిచ్చారు. నాగార్జున ఇచ్చిన పిలుపుకు అభిమానులు కేరింతలు కొట్టినా పలు సినిమా థియేటర్లపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు.
అసలు డమరుకం విడుదల కాకపోవడం వెనుక వేరే స్టోరీ నడుస్తోందని ఫిలిమ్ వర్గాలు చెపుతున్నాయి. చిత్ర నిర్మాత పలువురుకు అప్పు పడ్డారనీ, ఆ అప్పు తమకు చెల్లించనిదే బాక్సులు కదలనివ్వబోమనీ నిన్న రాత్రి పలువురు ఫైనాన్షియర్లు ప్రసాద్ ల్యాబులో హంగామా చేశారట. దాంతో నిర్మాతకు ఏం చేయాలో తెలియక చేతులెత్తేసినట్లు సమాచారం. మొత్తమ్మీద ఈ డమరుకం విడుదల కావాలంటే శివుడే రంగంలోకి దిగాలేమో..?!!
Great information, it's really helpful...
ReplyDeletehttps://www.ins.media